'విజయ్ సేతుపతి'గా వస్తోన్న విజయ్ సేతుపతి
- November 04, 2019
విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా విజయా ప్రొడక్షన్ వారి నిర్మాణంలో తమిళంలో నిర్మాణమవుతున్న 'సంగతమిళ్' మూవీని హర్షిత మూవీస్ వారు తెలుగులో 'విజయ్ సేతుపతి' పేరుతో విడుదల చేయనున్నారు. రెండు భాషల్లో నవంబర్ 15న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సౌత్‌లో సెల్ఫ్ మేడ్ స్టార్స్‌లో విజయ్ సేతుపతి స్థానం ప్రత్యేకంగా నిలుస్తుంది. 'సైరా'తో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఆదరణ ఉంది. త్వరలోనే ఆ ఆదరణ 'విజయ్ సేతుపతి'తో మరింత పెరుగుతుందని చిత్ర యూనిట్ అంటుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతితో పాటు చిత్రయూనిట్ అందరూ ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రావురి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'విజయ్ సేతుపతి' తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అని నమ్ముతున్నాను. విజయ్ సేతుపతి సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాశీఖన్నా, నాజర్, నివేద పేతురాజ్, అశుతోష్ రాణా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన వారే కావడంతో ఈ సినిమా స్ట్రైయిట్ సినిమాగానే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కుతాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించనున్నాము..'' అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







