కరణ్ జోహార్ తో భేటీ కానున్న ప్రభాస్
- November 06, 2019
బాహుబలి 1, బాహుబలి 2, సాహో లాంటి సినిమాలు ప్రభాస్ ఇమేజ్ను అమాంతం పెంచేశాయి. బాహుబలి సినిమాలతో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్.. సాహో లాంటి డబ్బింగ్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఊపేశాడు. ఇక నేరుగా బాలీవుడ్ చిత్రం చేస్తే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అలాంటి ఓ వార్తే ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం జాన్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కొంత పార్ట్‌ను షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగానే ప్రభాస్ బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. దీని కోసం ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
డబ్బింగ్ చిత్రాలతోనే ఇప్పటివరకూ హిందీ ప్రేక్షకుల్ని పలకరించిన ప్రభాస్ ఇకపై నేరుగా హిందీ సినిమాలోనే నటించనున్నారనే వార్త ఫుల్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ చిత్రం కోసం ప్రభాస్ ముంబై వెళ్లబోతున్నాడు. అక్కడ కరణ్ జోహార్ ని కలవబోతున్నాడు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే డార్లింగ్ రెడీ అంటే సినిమా చేయడానికి కరణ్ జోహార్ సహా పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ కనిపిస్తోంది.
ప్రభాస్ కోసం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు క్యూలో ఉన్నారు. వీళ్లలో సురేందర్ రెడ్డి.. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్.. గీత గోవిందం పరశురామ్ ఫ్రంట్ రన్నర్స్ గా ఉన్నారని ప్రచారమవుతోంది. అయితే ఆ ముగ్గురిలో ప్రభాస్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారోనన్న ఉత్కంఠ ప్రభాస్ అభిమానుల్లో ఉంది.సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. మరి ప్రభాస్ 21 ఎవరితో ఉంటుంది? సురేందర్ రెడ్డితోనా.. లేక కరణ్ జోహార్ తోనా? లేక ఇంకెవరితో అన్నది తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







