ఆ ఫ్లైట్ టాయిలెట్ లో 5.6 కిలోల బంగారం... విలువ రూ. 2. 24 కోట్లు
- November 06, 2019
దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మాత్రమే కాదు , ఢిల్లీ, చెన్నై ఇలా ఎక్కడ చూసినా బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. కిలోల కొద్దీ బంగారం ఎయిర్ పోర్ట్ లలో పట్టుబడుతుంది. ఇక చాలా విమానాల్లో సైతం బంగారం పట్టుబడుతున్న ఘటనలు లేకపోలేదు .
తాజాగా దుబాయ్ లో బయలుదేరిన ఓ విమానంలో బంగారం స్మగ్లింగ్ కు పాల్పడ్డారు ఆగంతకులు . అయితే అధికారులకు ఈ సమాచారం అందిన అనుమానంతో వారు ఆ బంగారాన్ని చెన్నైలో ల్యాండ్ అయిన ఓ విమానం టాయిలెట్ లో పెట్టి వెళ్ళిపోయారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలలో 5.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
దుబాయ్ నుండి చెన్నై కి బయలుదేరిన విమానంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తమకు ఫిర్యాదు అందిందని, ప్రయాణికులు ఎవరి వద్దా బంగారం లభించక పోవడంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఇక తనిఖీలలో మరుగుదొడ్డిలో దాచిన బంగారం బయటపడింది . టేపుతో చుట్టి ఉంచిన నాలుగు బండిల్స్ లో 5.6 కిలోల బంగారాన్ని కనుగొన్నారు కస్టమ్స్ అధికారులు .ఇక ఆ బంగారాన్ని సీజ్ చేశారు.
48 బంగారం కడ్డీలు ఆ బండిల్స్ లో ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ. 2.24 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇంతకీ ఈ బంగారాన్ని టాయిలెట్ లో పెట్టి వెళ్ళిన వారు ఎవరు అన్న దానిపై ఎయిర్ పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రోజుకొక మార్గంలో ఎవరికి అనుమానం రాకుండా, స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నారు. అడ్డుకట్ట వెయ్యటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కంట్రోల్ చెయ్యటం దేశ వ్యాప్తంగా కష్టంగా మారింది.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







