నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి
- January 12, 2016
పైరసీని అరికట్టాల్సిందిగా సినీ నటుడు నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం ద్వారా కేవలం తనకు మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమకు మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం సాక్షి టీవీ చానెల్ లో ది ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు నాగార్జున లైవ్ ద్వారా కేటీఆర్ తో మాట్లాడారు.ముందుగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున అనంతరం సినిమా వర్గం తరుపున ఒక విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా రంగాన్ని పైరసీ పట్టి పీడిస్తోందని, దానిని అరికడితే అటూ సినీ పరిశ్రమకు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని గుర్తు చేశారు.ఈ విజ్ఞప్తిని సావధానంగా విన్న కేటీఆర్ చిరునవ్వులు పూయిస్తూ అందుకు సరేనన్నారు. తాను నాగార్జునకు గొప్ప ఫ్యాన్ అని, శివ సినిమా అప్పటి నుంచే అభిమానిగా మారిపోయానని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







