బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్, రజనీ
- November 08, 2019
కమల్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ కోసం చెన్నైలో కొత్త కార్యాలయం నిర్మించుకున్నారు. ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి రజనీకాంత్ సహా అనేకమంది చిత్రప్రముఖులను ఆహ్వానించారు. ఆ కార్యాలయంలోనే బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేయించిన కమల్, ఆ విగ్రహాన్ని రజనీకాంత్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీకాంత్, కమల్ హాసన్ ఒకరిపై ఒకరు అభినందనల జల్లు కురిపించుకున్నారు. కమల్ రాజకీయాల్లో ప్రవేశించినా సినిమా రంగాన్ని మాత్రం మర్చిపోలేదని, కళను ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నారని రజనీ కొనియాడారు. కమల్ మాట్లాడుతూ, రజనీ, తాను ఒకరినొకరు గౌరవించుకుంటామని, విమర్శించుకుంటామని, ఒకరి పనిని మరొకరం ఇష్టపడుతూనే ఉంటామని వివరించారు. ఇరువురి భవిష్యత్ శుభప్రదంగానే ఉంటుందని తమకు గట్టి నమ్మకం అని తెలిపారు. కాగా జాతీయ స్థాయిలో తమదైన ముద్రవేసిన రజనీకాంత్, కమల్ హాసన్ కూడా బాలచందర్ శిష్యులే. ఇప్పుడు వారిద్దరూ తమ గురువైన బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ధన్యులయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







