పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్

పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మంత్రుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న లేఖను ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫడణవీస్ అందించారు. నా రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడణవీస్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అవకాశమివ్వాలని గవర్నర్‌ను బీజేపీ కొరలేదని తెలిసింది. మరోవైపు సీఎం పదవిని తమ పార్టీ నేత చేపట్టబోతున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

Back to Top