'భారతీయుడు' లుక్ విడుదల
- November 09, 2019
దక్షిణాది సినీ చరిత్రలో మైలురాయిలా నిలిచిన చిత్రాల్లో 'భారతీయుడు' ఒకటి. ఈ సినిమా వచ్చిన ఇరవై ఏళ్లకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుండటం విశేషమే. పదేళ్లుగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్న శంకర్.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. సినిమా చిత్రీకరణ మొదలయ్యాక కొన్ని ఇబ్బందులు తలెత్తి దీన్ని ఆపేస్తున్నట్లుగా వార్తలొచ్చినా.. అ అడ్డంకుల్ని అధిగమించి మళ్లీ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు శంకర్. కొన్ని రోజులుగా నిర్విరామంగా చిత్రీకరణ సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో కమల్ లుక్ కొద్ది కొద్దిగా బయటికి వచ్చింది. ఇప్పుడు గురువారం కమల్ పుట్టిన రోజు సందర్భంగా కమల్‌ను నేరుగా చూపించకుండా వెనుక నుంచి 'భారతీయుడు'ను చూపిస్తూ ఒక లుక్ రిలీజ్ చేసి లోకనాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు శంకర్.ఈ కొత్త పోస్టర్ చూసిన కమల్ ఫ్యాన్స్‌కు, 'భారతీయుడు' అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక పెద్ద కోట లాంటి నిర్మాణంలో నుంచి నగరాన్ని తీక్షణంగా చూస్తున్నాడు భారతీయుడు ఇందులో. కమల్ ఈ చిత్రంలో 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఆయన నిలబడ్డ తీరు మాత్రం కుర్రాడిలా ఉంది. ఈ విషయంలో శంకర్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటాడనడంలో సందేహం లేదు.
దక్షిణాదిన సీక్వెల్స్ అంతగా అచ్చిరాని నేపథ్యంలో శంకర్ ఎలా అంచనాల్ని అందుకుంటాడన్నది ఆసక్తికరం. '2.0' చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వాళ్లే ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రకుల్ ప్రీత్ ఓ కీలక పాత్ర చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంగీతాన్నందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!