మమ్ముట్టి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్..
- November 10, 2019
మలయాళం ఇండస్ట్రీ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ మమ్ముట్టి కొత్త సినిమా లుక్ ఈరోజు విడుదల చేశారు. సంతోష్ విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మమ్ముట్టి సినిమా విడుదలకు సిద్దమవుతుంది.
ఈ నేపథ్యంలోనే మమ్ముటి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా పేరు వన్ గా నిర్ణయించారు. ఇప్పటికే మలయాళంలో వరుసగా సినిమాలు తీస్తున్న మమ్ముట్టి ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ వన్ చిత్రాన్ని శ్రీలక్ష్మి నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా మమ్ముట్టి ఇప్పటికే దాదాపు 400 సినిమాలలో నటించారు. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లోని ప్రస్తుతం నటిస్తున్నారు. ఇటీవలే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో నటించి కాదు కాదు జీవించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
కాగా తాజాగానే మమ్ముట్టి విభిన్నమైన కథాంశంతో మామాంగం అనే చిత్రంలో నటించారు. మామాంగం అనే టైటిల్ తో మలయాళంలో రూపొందిన ఈ సినిమా, అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను ఈ నెల 21వ తేదీన పలకరించనుంది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా నిన్ననే రిలీజ్ అయ్యింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!