డిసెంబర్ 5న విడుదల కానున్న '90 ఎంఎల్'
- November 10, 2019
'ఆర్‌ఎక్స్100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన '90 ఎం.ఎల్` రిలీజ్ డేట్ ఫిక్సయింది. డిసెంబర్ 5న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ చిత్రంతో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'ఆర్ ఎక్స్100' తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి కథానాయిక. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కి సొంతం చేసుకుంది.
నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ ``ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 90.ఎంఎల్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. విజువల్‌గానూ రిచ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా అజర్‌బైజాన్‌లో మూడు పాటలు చిత్రీకరించాం. సినిమా గురించి మంచి పాజిటివ్ బజ్ స్ప్రెడ్ అయింది. శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం`` అని అన్నారు.
దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ ``ఆర్.ఎక్.100లో కార్తికేయను చూడగానే 90 ఎంఎల్ స్క్రిప్ట్ కి పక్కాగా సరిపోయే హీరో అనిపించింది. డిసెంబర్ 5న థియేటర్లలో సినిమా చూసిన వారు కూడా కార్తికేయకు టైలర్ మేడ్ కేరక్టర్ అని ఫిక్సవుతారు. రీసెంట్‌గా అజర్‌బైజాన్ లో మూడు పాటలను చిత్రీకరించాం. ఆ పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది`` అని చెప్పారు.
నటీనటులు:
కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, అజయ్ , ఆలీ , ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: జీఎం శేఖర్, పాటలు: చంద్రబోస్, ఫైట్స్: వెంకట్, జాషువా, కొరియోగ్రఫీ: జానీ, కో-డైరెక్టర్ :బాస్ గూడూరి(సిద్ధు) , ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, నిర్మాత : అశోక్‌రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం :శేఖర్ రెడ్డి ఎర్ర .
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







