మొత్తానికి పునర్నవి పై మనసులో మాటను బయటపెట్టిన రాహుల్
- November 11, 2019
'బిగ్ బాస్ 3' విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పెద్దగా టాస్క్ లు ఆడకపోయినా, అంతా తన గురించి మాట్లాడుకునేలా చేయగలిగాడు. నటి పునర్నవి .. సింగర్ రాహుల్ మధ్య నడిచిన కొన్ని ఎపిసోడ్స్, వాళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే భావనను కలిగించాయి. వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. తనకి ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనీ పునర్నవి, తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని రాహుల్ చెప్పినా బయట వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'పునర్నవితో కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తావా?' అని అంతా అడుగుతున్నారు. నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే ఎంతమాత్రం వదులుకోను" అని రాహుల్ తన మనసులోని మాటను చెప్పాడు. మరి ఈ జంటకు ఆ ఛాన్స్ తగులుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







