'మార్కెట్‌రాజా ఎంబీబీఎస్': 'దాదా'గా సీనియర్ తార రాధిక
- November 12, 2019
పలు చిత్రాల్లో రౌడీ తరహా పాత్రల్లో నటించిన సీనియర్ తార రాధిక మరోసారి దాదాగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. 'బిగ్‌బాస్' ఫేమ్ ఆరవ్ హీరోగా దర్శకుడు చరణ్ తెరకెక్కించిన 'మార్కెట్‌రాజా ఎంబీబీఎస్'లో రాధిక ఆహార్యం కూడా భిన్నంగా ఉంది. నోటిలో చుట్ట పెట్టుకుని, బుల్లెట్ నడుపుతూ ఉన్న స్టిల్స్ ఆమె పాత్ర పట్ల ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సురభి ఫిలింస్ బ్యానర్‌పై హారర్ కామెడీగా రూపొందిన 'మార్కెట్‌రాజా ఎంబీబీఎస్'ను ఈనెల 29వ తేదీ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో యువతార కావ్య తపర్, గ్లామరస్ హీరోయిన్ నికిషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఆరవ్ తల్లి పాత్రను రాధిక పోషించారు. ఇక 'సైతాన్', 'ఓకే కన్మణి' తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆరవ్ సోలో హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా శ్రమిస్తున్నాడు. ఆ కలను 'మార్కెట్‌రాజా ఎంబీబీఎస్' నెరవేరస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ కావ్య తపర్ కూడా ఈ చిత్రం ద్వారా తమిళంలో మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉంది.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







