బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం...15 మంది మృతి

బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం...15 మంది మృతి

ఢాకా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. బంగ్లాదేశ్‌లోని బ్రహ్మన్ బరియాలోని మండోభాగ్ రైల్వేజంక్షన్ లో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ను ఢాకా నుంచి వస్తున్న రైలు ఢీకొనడంతో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బ్రహ్మన్ బరియా జనరల్ ఆసుపత్రి, కుమిల్లా సదర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన రైలు బోగీలను రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు.

Back to Top