ఉత్తర ఒమన్‌కి భారీ వర్ష సూచన
- January 12, 2016
మధ్యస్థం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒమన్‌లోని ముసాదమ్ మరియు బురైమి గవర్నరేట్స్ పరిధిలో భారీ వర్షాలు కురియనున్నాయి. దక్లియా, దమిరా మరియు మస్కట్ వర్నరేట్స్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు తగిన జాగ్త్రలు తీసుకోవాలనీ, ముంపు ప్రాంతాల్లోనివారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం, గురువారాల్లో ఈ వర్షాలు భారీగా కురవనున్నాయి. భారీ వర్షాలతో దేశమంతటా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో ఒమన్ మధ్యస్థం నుంచి భారీ వర్షాలను చవిచూడవలసి ఉంటుంది. ఇదంతా ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







