షెర్టన్ పార్క్‌లో అండర్‌గ్రౌండ్ పార్కింగ్
- January 12, 2016
నాలుగు లెవల్స్‌తో కూడిన 2800 వాహనాల సామర్థ్యం కలిగిన పార్కింగ్ సౌకర్యం షెర్టాన్ పార్క్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరు లేదా, వచ్చే నెల మొదటివారంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ని అందుబాటులోకి తీసుకు రానున్నామనీ, దీనికోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని షెర్టన్ వర్గాలు వెల్లడించాయి. షెర్టాన్ దోహా హోటల్ ఎదురుగా ఉన్న కొత్త పబ్లిక్ పార్క్ వారాంతాల్లో కుటుంబ సమేతంగా ఎంజాయ్ చెయ్యడానికి వీలుగా రూపొందించారు. ఫిట్నెస్ ఎక్విప్మెంట్తో కూడిన మినీ ప్లేగ్రౌండ్ ఈ పార్క్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. ఏడు హెక్టార్లలో తీర్చిదిద్దిన పబ్లిక్ గార్డెన్‌లోని ల్యాండ్‌స్కేపింగ్ అందర్నీ ఆకట్టుకోనుంది. ఫౌంటెయిన్స్, మినీ వాటర్ ఫాల్స్ సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి. సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం తగిన చర్యలు చేపట్టామని షెర్టన్ పార్క్ వర్గాలు చెప్పాయి. కొత్త పార్కింగ్‌లో అవసరమైన మేరకు ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్ని ఏర్పాటు చేశారు. కార్ పార్క్ బిల్డింగ్‌లో కొంత భాగం ఎయిర్ కండిషన్డ్గానూ మలచారు. 12కి పైగా ఎలివేటర్స్తో, అత్యద్భుతంగా ఈ పార్కింగ్ స్పాట్స్‌ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







