దోస్త్ ఓ మాట

- January 12, 2016 , by Maagulf

ఎందుకలా కోపంగా చిరాగ్గా 
అబ్బా ఎందుకంత అశాంతి,

వద్దు, ఇక్కడందరికి ఏది వడ్డించి ఉండక
పోవచ్చు,నీ నూకలు నువ్వే పండిచుకోవాలి 

అధైర్యాల అఘాదాలు,నైరాశ్యాల అరణ్యాలు 
సృష్టించు కోవడమెందుకు

నీ అహాన్నిజయించి,నీ లోని సోమరిని ఓడించి 
కష్టాన్ని నమ్మితే నష్టంమేం కలదు,ఆర్థిక లాభం  
మానసిక ఆనందం,శారీరక ఆరోగ్యమే తప్ప!

జీవితం పై ఆశ-కసి, ఉండటం ఒప్పేనేమో కానీ 
నీకు లేని దానిని తలుచుకొని,ఇతరులకున్న
దాన్ని,స్వర్గం అనుకొని 

ఎందుకయ్యా కుమిలిపోతావు?

వలచి కట్టుకున్న అబలపై ఎగసి ఎగసి పడి 
నీ అక్కసంతా వెల్లగక్కుతావు,

కుపితుడవైన నీవెంత బలహీనుడవయ్యావో 
నీకు తెలియాలంటే,తేలికైన నీ మనసు ఆనందం
నీవు చూడాలంటే   

నీవిక- ప్రకృతి అనంత శక్తుల ఆరాధన లో మునిగి,
కల్పిత ఆధునిక  వస్తువుల్తో మమకారం వీడి, 
శ్రమైక ఆనందాల అద్వైతాలను చూస్తూ .. 
 
తామరాకుపై నీటి బొట్టోలె ఈ లోకానా .. 
నీలో నువ్వు వసించాల్సిందే.. 
  

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com