ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు దాటిన గండం
- November 13, 2019
హాంకాంగ్: ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు చాన్నాళ్ల తర్వాత తొలిరౌండ్ గండాన్ని దాటింది. హాంకాంగ్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గా ఉన్ (ద.కొరియా)పై 21-15, 21-16తో వరుస గేముల్లో విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ఆటను ముగించింది. తర్వాతి రౌండ్లో థాయ్‌ల్యాండ్ అమ్మాయి బుసానన్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ పరాజయం పాలయ్యాడు. 54 నిమిషాలు పోరాడి 11-21, 21-13, 8-21 తేడాతో ఓడాడు. అంతకు ముందు సైనా నెహ్వాల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
రెండు గేముల్లోనూ సింధు ఆధిపత్యం చెలాయించింది. మొదట 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుంజుకున్న కిమ్ స్వల్ప విరామానికి ముందు 11-10తో సింధును వెనక్కినెట్టింది. 13-13తో స్కోర్లు సమమైన స్థితిలో భారత షట్లర్ విజృంభించి వరుసగా 6 పాయింట్లతో గేమ్ గెలిచింది. రెండో గేమ్ సైతం 5-5తో సమమైనప్పుడు సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 7 పాయింట్లు సాధించి 12-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలిచింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







