'కోడీశ్వరి' క్విజ్ షోకు రాధిక హోస్ట్
- November 13, 2019
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఈ షో గుర్తింది కదా..! బాలీవుడ్‌లో.. అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్లింది. ఇది బాగా పాపులర్ అవడంతో.. అనంతరం ఈ షోను వివిధ భాషల్లోనూ తీసుకొచ్చారు. తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఈ షోకి వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. తమిళంలో 'నీంగలుమ్ వెల్లాలుమ్' ఒరు కోడి' పేరుతో.. సూర్య, ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిలు ఒక్కో సీజన్‌లో హోస్టులుగా వ్యవహరించారు.
కాగా.. ఇప్పుడు ఈ షోకు.. సినీనటి రాధికకు లింక్ ఏంటని అనుకుంటున్నారా..? అసమాన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఈషోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. కోటీశ్వరుడు మాదిరిగా.. తమిళంలో 'కోడీశ్వరి' అనే గేమ్ షోను ప్లాన్ చేశారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేయనున్నారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించిన రాధికా తొలిసారి హోస్ట్‌గా దర్శనమివ్వనున్నారు. కలర్స్‌లో టీవీ ఛానెల్‌లో ఈ షో ప్రసారం కానుంది. డిసెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే.. ఈ షో టైమింగ్స్ ఇంకా డిసైడ్ చేయలేదు.
ఈ సందర్భంగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రాధికకు ఓ వీడియో రికార్డ్ చేసి పంపారు. ఆ వీడియోలో.. మొదటిసారిగా.. ఈ షోకు ఓ లెడీ సూపర్ స్టార్ హోస్ట్‌గా వ్యవహరించడం.. కేబీసీ చరిత్రలో సువర్ణ అధ్యాయం.. అందులోనూ.. ఓన్లీ ఫీమేల్స్ కోసమే ఈ షో ఉండటం గమనించదగ్గ విషయం. మీ కెరీర్‌లో ఎంత ఉన్నత స్థానం సంపాదించారో.. ఇందులో కూడా మంచి పేరు సాధించాలని కోరుకుంటూ.. రాధికకు ఆల్‌దిబెస్ట్ చెప్పారు అమితాబ్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







