వరుణ్ సందేశ్, వితిక చేతుల మీదుగా 'పిచ్చోడు' ఆడియో విడుదల
- November 19, 2019హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా 'పిచ్చోడు'. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఫస్ట్ లుక్కు సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్రయూనిట్ ప్రకటించింది. క్రాంతి, కె. సీమర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నవంవర్ 22న విడుదల కాబోతోన్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్ర ఆడియోని వరుణ్ సందేశ్, వితిక విడుదల చేశారు.
హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు రావాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని వరుణ్ దంపతులు అన్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయని, ఈ మూవీలో నటించిన నటీనటులందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..