వరుణ్ సందేశ్, వితిక చేతుల మీదుగా 'పిచ్చోడు' ఆడియో విడుదల
- November 19, 2019
హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా 'పిచ్చోడు'. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఫస్ట్ లుక్‌కు సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్రయూనిట్ ప్రకటించింది. క్రాంతి, కె. సీమర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నవంవర్ 22న విడుదల కాబోతోన్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్ర ఆడియోని వరుణ్ సందేశ్, వితిక విడుదల చేశారు.
హీరో క్రాంతికి ఈ సినిమాతో మంచి పేరు రావాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని వరుణ్ దంపతులు అన్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయని, ఈ మూవీలో నటించిన నటీనటులందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







