పెరుగుతున్న చలి: షిరిడీకి విమానాలు రద్దు

- November 20, 2019 , by Maagulf
పెరుగుతున్న చలి: షిరిడీకి విమానాలు రద్దు

తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదుడిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీనికితోడు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, థాంసీ, కొమరం భీం సిర్పూరులో 13.7డిగ్రీల చొప్పున నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గాలిలో తేమ శాతం తగ్గుముఖం పట్టడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

మరోవైపు..తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు , మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి.

ఇదిలా ఉంటే..ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి షిరిడీకి వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. స్పైస్‌జెట్‌ విమానాలతోపాటు ఇండిగో, ఎయిర్‌ ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిన్న వెళ్లాల్సిన ఆయా విమానాలను నేటికి రీ షెడ్యూల్‌ చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణాలు రద్దవడంతో ప్రయాణికులకు ఆయా సంస్థలు విమాన చార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com