కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!

- November 10, 2025 , by Maagulf
కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!

కువైట్: కువైట్ లో సేవ మరియు భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడం లక్ష్యంగా సంస్కరణలు కొనసాగుతున్నాయని మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ అల్-సబా వెల్లడించారు. గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగిన ఇనిషియేటివ్స్ ఫోరమ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.  పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు ఈ సంస్కరణల సానుకూల ఫలితాలను త్వరలో అనుభవిస్తారని తెలిపారు. 

ఈ సందర్భంగా ఎంట్రీ వీసాలను జారీ చేయడంలో కువైట్ సామర్థ్యాన్ని షేక్ ఫహాద్ హైలైట్ చేశారు.  ఈ ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదని, ఐదు నిమిషాల్లోనే ఆమోదం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతా సహకారంపై స్పందిస్తూ.. గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం ఉందని షేక్ ఫహాద్ చెప్పారు.  

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో ఉమ్మడి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.  కువైట్ దాని సముద్ర మరియు భూ సరిహద్దులను కవర్ చేసేలా అధునాతన రాడార్ వ్యవస్థను కలిగి ఉందని షేక్ ఫహాద్ తెలియజేశారు. ఇది దేశంలోకి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com