అందుకే `జబర్దస్త్` నుంచి బయటికొచ్చా: నాగబాబు
- November 22, 2019
తెలుగు బుల్లితెరపై ఏడున్నరేళ్లుగా నవ్వుల పువ్వులు పూయిస్తున్న అతిపెద్ద కామెడీ రియాలిటీ షో `జబర్దస్త్`. ఈ షో ఆరంభం నుంచి ఇప్పటివరకు రోజాతోపాటు నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక, ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్టు నాగబాబు స్వయంగా వెల్లడించారు. నేటి (శుక్రవారం) ఎపిసోడ్‌తో `జబర్దస్త్` నుంచి తప్పుకుంటున్నట్టు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన వెల్లడించారు. ` 2013 నుంచి 2019 వరకు `జబర్దస్త్`తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా ఆ కార్యక్రమం నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. సృజనాత్మక విభేదాల వల్లే బయటకు రావాల్సి వచ్చింది. దీంట్లో ఎవరి తప్పూ లేదు. నాకు అవకాశం ఇచ్చిన `జబర్దస్త్` నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ షోకు వచ్చాను. కామెడీపై నాకు ఉన్న ఆసక్తి చూసి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి అవకాశం ఇచ్చారు. నా స్థాయికి తగ్గట్టు కాకపోయినా మంచి పారితోషికమే ఇచ్చారు. ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడింది. పారితోషికం వల్లే `జబర్దస్త్`ను వదిలేస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కాదు. ఇన్ని రోజులూ ఎంతో సరదాగా ఈ షో నడిచింది. అందుకు మరోసారి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ కార్యక్రమం గురించి నేను ఏనాడూ, ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. వివాదాలు కోరుకోలేదు. `జబర్దస్త్`లో నా ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా పూర్తయింది అనేది త్వరలో వెల్లడిస్తాన`ని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







