తెలంగాణ: రైతుబంధుకు పరిమితి

- November 22, 2019 , by Maagulf
తెలంగాణ: రైతుబంధుకు  పరిమితి

తెలంగాణలో రైతుబంధు పథకానికి ప్రభుత్వం పరిమితి విధించడం జరిగింది. 10 ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతుబంధు పథకం అమలు చేయాలనే భావనలో ఉంది సర్కార్. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి సీఎంవో కార్యాలయానికి ఫైల్ వెళ్లినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ పాత బకాయి, రబీ సీజన్ కు సంబంధించి చెల్లించాల్సిన డబ్బులు సర్దుబాటు కానీ నేపథ్యంలో పథకం పై సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనికి అర్హతను తగ్గించడమే ఉత్తమమనే భావనకు అధికారులు కూడా రావడం జరిగింది. దీని పట్ల సీఎం కూడా సుముఖంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులందరికి రైతుబంధును నిలిపివేయాలని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం ఎన్ని ఎకరాలున్నా ఎకరానికి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రెండు సార్లు ఎకరానికి రూ.10వేలు రైతుబంధు ద్వారా పంటసాయాన్ని సర్కార్ ఇస్తుంది. దీని ద్వారా ఎక్కువ ఎకరాలు ఉన్న భూస్వాములు అధిక లాభం పొందుతున్నారని చిన్న రైతులు ఆరోపిస్తున్నారు. ఉదాహారణకు 20 ఎకరాలు ఉన్న రైతుకు సంవత్సరానికి ఎకరానికి 10 వేలు చెల్లిస్తే రూ.2 లక్షలు రైతుబంధు అందుతుంది అని తెలుస్తుంది.

ఒక ఎకరం ఉన్న రైతుకు రూ. 10 వేలు మాత్రమే వస్తున్నాయి. ఇలా రైతుబంధు ద్వారా భూస్వాములే బడాబాబులు అవుతున్నారని చిన్నరైతులు గతంలోనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు రైతుబంధును అర్హులైన పేదరైతులకు మాత్రమే అమలు చేయాలని సర్కార్ నిర్ణయించినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా దీని పై ప్రకటన వెల్లడించడం జరిగింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానా పై కూడా భారం తగ్గుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. దీని పై చిన్న, సన్నకారు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని సమాచారాలు వినిపిస్తున్నాయి. దానికి రైతులకు శుభవార్త అందినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com