'తలైవీ' ఫస్ట్ లుక్ విడుదల...
- November 23, 2019
ఈ మద్య వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) తెలుగు, హిందీ భాషల్లో రాజకీయ,సినీ, క్రీడా నేపథ్యంలోనే కాదు ప్రముఖల జీవితాలపై కూడా ఎన్నో బయోపిక్ లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను 'తలైవి' పేరుతో తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది.
అరవిందస్వామి ఇందులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో లెజెండ్రీ పొలిటీషియన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పాత్రలో ఆ మద్య జూనియర్ ఎన్టీఆర్ ని అనుకున్నప్పటికీ ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్ 'మూవీ బిజీలో ఉంటం వల్ల తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా జయలలితగా నటిస్తోన్న కంగనా రనౌత్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. కటౌట్‌లో ఉన్న కంగనాను చూస్తుంటే అచ్చు అమ్మని చూసినట్టే ఉందంటున్నారు తమిళ ప్రజలు. కంగనా జయలలితగా బాగా మేకోవర్ అయ్యారు.
సినిమాను 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు.'బ్లేడ్ రన్నర్', 'కెప్టెన్ మార్వెల్' వంటి హాలీవుడ్ మూవీస్ లో వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కంగనా రనౌత్‌ను ప్రత్యేక మేకప్‌తో జయలలితగా చూపిస్తున్నారు. మొత్తానికి ఈ మూవీతో దేశ వ్యాప్తంగా మరో సంచలనం సృష్టించబోతున్నట్లు అర్థం అవుతుంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







