హైదరాబాద్ తనకు సెలబ్రిటీ స్టేటస్ ను ఇచ్చింది: సానియా మీర్జా
- January 13, 2016
హైదరాబాద్ తనకు సెలబ్రిటీ స్టేటస్ ను ఇచ్చిందని టెన్సిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సానియాతో ముచ్చటించిన నగరంపై తనకున్న ప్రేమను పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే.. 'ఈ మహానగరంతో నా జీవితం ముడిపడి ఉంది. నా స్కూలింగ్, కాలేజీ, స్పోర్ట్స్ లైఫ్ అన్నీ హైదరాబాద్‌లోనే సాగాయి. నేను పక్కా హైదరాబాదీని. నగర వాతావరణమంటే చాలా ఇష్టం. నేను సాధించిన ప్రతి విజయంలోనూ నగరం వెన్నంటి ఉంది. ప్రతి న్యూ ఇయర్ వేడుకలకు సిటీలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. నా చిన్నప్పటికీ ఇప్పటికీ సిటీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. మా నాన్న నన్ను ఒక సెలబ్రిటీలా చూడాలనుకున్నారు.అందుకే అందరిలా ఇల్లు, చదువు, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో నన్ను పెంచలేదు. మెట్రోసిటీగా అవతరించిన హైదరాబాద్ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. ఈ సిటీలో నేనూ భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది'.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







