యు.ఏ.ఈ లో ఆహ్లాదకరమైన వాతావరణం
- January 13, 2016
యు.ఏ.ఈ లో, మేఘావృతమై ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి చెల్లాచెదురుగా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని , దీంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గే స్థితి ఏర్పడుతుందని వాతావరణ శాస్త్ర మరియు సిస్మాలజీ సెంటర్ ఒక ప్రకటనలో, పేర్కొంది. బుధవారం పగటి కనిష్ట ఉష్ణోగ్రత 19 నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 22 దేగ్ర్రీసెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళలో కనిష్ట ఉష్ణోగ్రత 14 నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 17 దేగ్ర్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే తీర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 21 నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 24 దేగ్ర్రీల సెల్సియస్ ఉంటుంది. అంతర్గత ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 8 నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 13 దేగ్ర్రీల సెల్సియస్ ఉంటుంది. ఇక పర్వత ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 7 నుంచి 10 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 10 నుంచి 14 దేగ్ర్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది. అరేబియన్ గల్ఫ్ జలాలలో ఒమాన్ సముద్రంలో కెరటాల ఉదృతి తీవ్రంగా ఉంటుందని వివరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







