ప్రముఖ నటిపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టిన దుండగులు
- November 29, 2019
ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అగోస్టిని, ఆమె ఫ్రెండ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లోని స్కైరూం బార్‌లో పార్టీ చేసుకున్న తర్వాత జెన్నిఫర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి తెల్లవారుజామున 3 గంటల సమయంలో బయటకి వచ్చింది. 'మీలాంటి తెల్ల ఆడకుక్కల దగ్గర డబ్బు ఉంది కాబట్టే ఇలా తాగి తిరుగుతున్నారు' అంటూ కొంత మంది ఆకతాయులు వారిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన బార్ సిబ్బంది వారిని అడ్డుకొని హాస్పిటల్‌కి తరలించారు. నిందితులని పోలీసులకి అప్పగించారు. జెన్నిఫర్ పార్టీ చేసుకున్న బార్‌లో ఆఫ్రికన్, అమెరికన్స్ సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వర్క్ పూర్తి చేసుకుని వెళ్లిపోయాక వారిలో ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు మర్చిపోవడంతో అది తీసుకోవడానికి బార్ క్లోజింగ్ టైంలో వచ్చాడు. దీంతో అతడిని లోపలకి అనుమతించలేదు. అయితే అదే సమయంలో తన స్నేహితులతో కలిసి బయటకి వస్తున్న జెన్నీఫర్‌ని చూసి కోపంతో ఊగిపోయిన వ్యక్తి వారి స్నేహితులతో కలిసి దాడి చేశాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. జెన్నీఫర్‌కి ఐదు కుట్లు పడినట్టు వైద్యులు తెలిపారు. నటిపై జాతి వివక్ష దాడి జరగడం అమానుషం అని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. జెన్నిఫర్ 'బ్లూక్లిన్ టైస్' అనే సినిమాలో నటించారు
తాజా వార్తలు
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







