డిక్టేటర్ :సినిమా రివ్యూ
- January 14, 2016
నటీనటులలో ముందుగా ఓ మాట చెప్తా.. నందమూరి బాలకృష్ణ మంచి నటుడు, చాలా టాలెంట్ తో పాటు మాస్ లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో.. కానీ ఆయనని సరిగా చూపించి దర్శకులు మాత్రం చాలా తక్కువ..ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఆయనని ఈ సినిమాలో అస్సలు ఉపయోగించుకోలేకపోయాడు డైరెక్టర్ శ్రీవాస్. బాలయ్య చూడటానికి మస్త్ స్టైలిష్ గా ఉన్నాడు. అదొక్కటే బాలయ్య పరంగా బెస్ట్. ఇక తన యాక్షన్ అండ్ డైలాగ్ డెలివరీ సింహా అండ్ లెజెండ్ సినిమాల్లో ఎలా ఉందొ అలానే ఫాలో అయిపోయాడు. బాధ అనిపించిన విషయం ఇదే ఒక స్టార్ హీరో సినిమాని కనీసం కొత్తగా ప్రెజంట్ చేయడానికి ట్రై చేయకపోతే ఎలా??? ఫైనల్ గా ఒక్కటే బాలయ్య ఎప్పటిలానే చేసాడు. బాగానే చేసాడు. అంజలి అల్లరి పిల్లగా, మెచ్యూర్ వైఫ్ గా బాగానే చేసింది. సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత కోసమే సినిమాలో వస్తుంది. ఆ పనిని పర్ఫెక్ట్ గా చేసి వెళ్ళిపోయింది. విలన్స్ గా చేసిన రతి అగ్నిహోత్రి, నవాబ్ షా, కన్బీర్ సింగ్ లకి సరైన పాత్రలు లేవు.. వీళ్లవసలు విలన్ పాత్రలేనా అనేలా పాత్రలు ఉన్నాయి. ఇకపోతే అక్ష, నాజర్, సుమన్, సాయాజీ షిండే లాంటి వాళ్ళు పరవాలేదని పిస్తే, కమెడియన్స్ అయిన వెన్నెల కిషోర్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రభాస్ శ్రీను, పోసాని క్రిష్ణమురళీ, శకలక శంకర్ లు నవ్వించలేక చతికిల పడ్డారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







