సామాజిక మాధ్యమాల ద్వారా వీసాలను పొందడం అది అక్రమ మానవ రవాణ నేరం
- January 14, 2016
సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీయులు కార్మిక మంత్రిత్వ శాఖ వీసాలను విక్రయించడం అది అక్రమ మానవ రవాణ నేరంగా పరిగణిస్తామని సౌదీ కు చెందిన మక్కహ్ పత్రిక పేర్కొంది. అంతర్జాతీయ న్యాయ ఆచార్యుడు అబ్దుల్సమెద్ అల్ అలీ మాట్లాడుతూ,అలీన దేశాల మధ్య ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మానవ రవాణా ఏ రూపంలో జరిగినా అది పెద్ద తప్పు అని అన్నారు. పౌరులు
తప్పక తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వీసాను అందించిన నిర్వాహకుడు దానిని రూపొందించడం లేదా మార్చడం సరి కాదన్నారు. అవి ఎన్నడు చట్టబద్ధంగా జరగాలని సూచించారు. విదేశీయులకు వీసాను గూర్చిన సమాచారం సోషల్ మీడియా లో పోస్టింగులను పెట్టడం , వాటి అమ్మకాలను గూర్చి బేరసారాలు జరపడం అది అక్రమ మానవ రవాణ నేరమని అల్ అలీ అన్నారు. ఈ తరహ ఉచ్చులో ఎక్కువుగా విదేశీయులు చిక్కుకొంటున్నారని, అయెతే వారికి ఏకైక రక్షణ కార్మిక చట్టం మాత్రమె అని చెబ్తూ , గల్ఫ్ దేశాలకు వలస వచ్చే అత్యధికుల్లో
అక్షరాస్యత శాతం తక్కువని , వీరికి సౌదీలో అమలవుతున్న పటిష్టమైన కార్మిక చట్టం గూర్చి సరైనా అవగాహన లేదని తెలిపారు. దీంతో వారికి తమ తమ విధులు బాధ్యతలు తెలియకపోవడంతో మోసానికి గురికాబడుతున్నారు. చట్టపరమైన విధానాలతో కార్మిక నియామకం జరిగితే , అది కార్మికునికి మేలని, సోషల్ మీడియా ద్వారా నియామక కార్యాలయాలు ,విదేశీయులను తప్పు దారి పట్టిస్తున్నాయి అని
ఆయన వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







