ఘనంగా జరిగిన 'వెంకీమామ' ప్రీ రిలీజ్ ఫంక్షన్
- December 08, 2019
రియల్ లైఫ్ మామ అల్లుళ్లు 'వెంకటేష్-నాగ చైతన్య' లు కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ 'వెంకి మామ'. గతంలో నాగ చైతన్య 'ప్రేమమ్' సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. పాయల్ రాజపుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి కేఎస్ రవీంద్ర దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. విలేజ్ నేపథ్యంలో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ లో మామపై అల్లుడి ప్రేమ.. అల్లుడిపై మామ ప్రేమని చక్కగా చూపించారు. ఆ తరువాత బార్డర్ సన్నివేశాలు చూపించారు. బార్డర్ కి వెళ్లిన అల్లుడు మూడు సంవత్సరాలు అయినా ఎందుకు తిరిగి రాలేదు? మిస్ అయిన అల్లుడు కోసం మామ బార్డర్ కు ఎందుకు వెళ్ళాడు? అనే విజువల్స్ తో మామా అల్లుళ్ల మధ్య అనుబంధం సూపర్ గా ఉంది.వెంకటేష్ చెప్పే వాయిస్ ఓవర్ "మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం" అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. రాశీ ఖన్నాతో చైతన్య లవ్ స్టోరి..
పాయల్ తో వెంకటేష్ సన్నివేశాలను ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు. హైపర్ ఆది..వెంకటేష్ తో 'ఎలాగైనా వీడికి ఓ అత్తను ఇవ్వండి' అని చెప్పడం దానికి వెంకటేష్ రియాక్ట్ అయ్యే విధానం చాలా ఫన్నీగా ఉంది. ఆ తరువాత గ్రామంలో కక్షలు-పగలు చూపారు.వారిని ఎలాగైనా చంపాలని అశుతోష్ రాణా, దాసరి అరుణ్ కుమార్ చెప్పడం ఆసక్తిని పెంచింది. నాజర్ 'వారిని ఎలాగైనా విడదీయాలి" అని చెప్పే డైలాగ్ తో అసలు మామ-అల్లుళ్లపై ఎందుకు కుట్ర చేస్తున్నారనే ఇంట్రస్ట్ కలిగేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
ఇన్నీ పాయింట్స్ కలవడంతో ఈ ట్రైలర్ చూస్తే ఏ పాయింట్ కూడా ఓ పట్టాన అర్ధం కాదు.ట్రైలర్ కు డివైడ్ టాక్ వచ్చింది. నాగ చైతన్యను కిడ్నాప్ చేసి వేరే చోట దాచి ఉండటం లాంటి సన్నివేశాలతో బాబీ తీసిన ఈ సినిమా రిస్క్ ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదు. థమన్ సంగీతంతో ఈ సినిమా సన్నివేశాలను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ట్రైలర్ అన్నీ జోనర్స్ ని కలిపి ఉన్నా సినిమాపై చిత్ర యూనిట్ మంచి నమ్మకంతో ఉంది.సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను శనివారం ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ లో ఘనంగా నిర్వహించారని ప్రెసిడెంట్ దొడ్డా రవి తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ 13న విడుదల కానుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







