మదిని మీటిన వర్షం-చివరి పార్ట్

- January 14, 2016 , by Maagulf

రూంకి వెళ్ళాను బాధతో ఏడుపు తన్నుకు వస్తోంది అందరు ఏమైంది సక్సెస్ హా అని అడిగారు తల అడ్డంగా ఊపుతూ మెల్లగా బాత్రూం లోకి వెళ్ళాను ఏడవాలనిపించింది గట్టిగ కాని ఎదవలు నవ్వుకుంటారు నేను ఏడ్చేది చూస్తే అంత చండాలంగా ఉంటుంది నా ఏడుపు… బాధ బయటకు పోకూడదు వాష్ బేసిన్ నిండా నీళ్ళు వదిలి తల పూర్తిగా ముంచి “ఐ లవ్ యు వర్ష” అని అరిచి గట్టిగ ఏడ్చేసాను …. బయటకు వచ్చి బ్యాగ్ తీసుకొని కింద పెళ్లి వాళ్ళతో వెళ్లి వస్తాను అని చెప్పను అందరు ఎందుకు వెళ్తున్నావు ఏమైంది ఉండు అని బతిమిలాడుతున్నారు …. ఏదో అబద్ధం చెప్పి పూజలో ఉన్న జంటకి విష్ చేసి బయటకు వచ్చాను అనిల్ గాడు బండి తీసుకొని వచ్చి ఎక్కమన్నాడు… ఎక్కి కూర్చున్నా…బండి పైన కూర్చున్న పైన నుంచి లహరి పిలిచింది కిందకి వచ్చి " రేయ్ ఆగరా నువ్వు అలా బాధ పడుతూ వెళ్ళడం నేను తట్టుకోలేకపోతున్నాను అసలు తనకు పెళ్లి సెట్ అయింది మాకు తెలిదు నన్ను క్షమించరా అయినా నీ లాంటి వాడిని అది పోగొట్టుకుంటుంది అంటే నేను ఒప్పుకోను తనతో నేను మాట్లాడుతాను ... నువ్వు తనని చూసే చూపులోనే అందరికి అర్థం అయింది రా నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో నీ గుండెలో తనని పిచ్చి వాడిలా ఎంత ఆరాదిస్తున్నావు అని నీ మనసు లోని ప్రేమని ఒక సారి చెప్పు తప్పకుండ నీ దగ్గరికి వస్తుంది ఒక సారి మనం కలిసి మాట్లాడుదాం... "వద్దు లారక్క తన మనసులో నేను ఒక జోకర్ లాగ మిగిలిపోయాను ఇప్పుడు లేని పోనీ మాటలు చెప్పి మంచి వాడిగా హీరో గా నన్ను నేను పోగుడుకోలేను వదిలేయ్ " అని బయలుదేరాము ఇద్దరి మధ్య మాటలు లేవు మౌనం ఇంత భయంకరంగా ఉంటుంది అని నేను ఊహించలేదు అసలు ఒక్క మాట మాట్లాడకుండా ఇంత సేపు ఎప్పుడూ లేను అది అనిల్ తో…. దారిలో బండి ఆపి టీ తీసుకొని వచ్చాడు ఏదో చెప్పబోయాడు వద్దు అని వారించి మళ్లీ బయల్దేరాము, దారిలో చిన్న చినుకులు మొదలయ్యాయి ఒక పది నిమిషాల్లో ఆగిపోయాయి “రేయ్ ఈ వర్షం కూడా ఆ వర్ష లాగే వచ్చి అందమైన ఊహల్ని చూపించి దాన్ని మనస్పూర్తిగా అనుభవించక ముందే జీవితాంతం వాటిని సొంతం చేసుకుందాం అనే లోపల అన్నింటిని కాల్చేసి వెళ్లిపోయింది కదా రా” ఇంటికి చేరుకున్న వాడు లోపలి వస్తుంటే వద్దురా వెళ్ళిపో అని వాడిని హత్తుకొని లోపలికి వెళ్ళిపోయాను అమ్మ నాన్న పలకరించారు ఏమి వినకుండా రూంలోకి వెళ్ళిపోయాను పిచ్చ కోపం తో మొబైల్ గోడకేసి కొట్టాను.. అనిల్ వెనకాల వచ్చి జరిగింది అమ్మకు నాన్నకు చెప్పి వెళ్ళిపోయాడు.. 
లహరి వర్ష దగ్గరికి వెళ్ళింది “ఏంటే వాడు నిన్ను అంతగా ఇష్టపడుతున్నాడు అని తెల్సు కదా, అయిన నీ పెళ్లి ఎప్పుడు సెటిల్ అయింది మాకు ఎందుకు చెప్పలేదు?? ఆ మాట మొదటి రోజు చెప్పి ఉంటె వాడికి ఇన్ని ఆశలు బాధలు ఉండేవి కాదు కదా ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ ఉండే వాడు బాధ పడుతూ కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళాడు నీ వల్ల ... ” వర్ష ఏడుస్తూ లహరిని హత్తుకొని “లేదే వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు అని అనుకోలేదు వాడు నన్ను ఇష్టపడుతున్నాడు అని తెలుసు కాని వాడు వేరే అమ్మయిలతోను అలాగే సరదాగా మాట్లాడుతున్నాడు … నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడ లేక వాడి బిహేవియర్ అలాగే ఉంటుందా అర్థం కాక పిచ్చి పట్టి పోయింది నాకు … ఆల్రెడీ అమ్మ నాన్నని పోగొట్టుకొని బాధలో ఉన్న నన్ను చాల సంతోష పెట్టాడు మనస్పూర్తిగా నవ్వించాడు కాని రేపు నేను తనని ఇష్టపడ్డక వాడు నేను లేదు ఇలాగే అందరితో సరదాగా ఉంటాను అని చెబితే నేను తట్టుకోలేను అందుకే తను నాకు ఇష్టమైన ఆ ఇష్టాన్ని చూపించకుండా చాల కంట్రోల్ చేసుకున్నా… ఇప్పుడు తన కన్నీళ్ళు బాధ చూసాక వాడు చాల ప్రేమిస్తున్నాడు అని అర్థం అయింది వెళ్లి చెబుదాం అనుకునే లోపల వాడు వెళ్ళిపోయాడు … ఏం చేయాలో అర్థం కాక నేను ఇక్కడే ఏడుస్తూ కూర్చున్నా” సరే ఫోన్ చేసి మాట్లాడుదాం అని కాల్ చేశా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది …. “వద్దు లేవే మీ అందరికి ఒక వారంలో నేనే గుడ్ న్యూస్ చెప్తా … అందరు పెళ్లి ఇంటి నుంచి వచ్చేసారు … అందరికి విషయం తెలిసి నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసారు దొరకలేదు నేను ఆరోజే బయల్దేరి హైదరాబాద్ వచ్చేసి వారం రోజులు తీరిగ్గా తనని తలచుకొని బాధ పడి ఆఫీసుకి వెళ్ళాను .. 
ఆఫీసు కి వెళ్తే ప్రతి ఒక్కడు అయ్యో పాపం అనట్టుగా జాలిగా చూస్తున్నారు నేను ఎప్పుడు ఉండేలాగా సరదాగా ఉండటానికి కష్టపడుతూ నటిస్తూ నవ్వించడానికి ట్రై చేస్తున్న కాని కళ్ళల్లో బాధ అందరికి కనిపిస్తోంది నన్ను బాధ పెట్టకూడదు అని అందరు నా కోసం నవ్వుతున్నారు … ఇంతలో వర్ష అటుగా వెళ్తూ కనిపించింది “అనిల్ వర్ష రా ” అదంతా నీ భ్రమ రా వర్ష లేదు అక్కడ” …. కొంచం సేపు తరువాత మళ్లీ వర్ష కంటపడింది వర్ష అని పిలిచా “వర్ష లేదు ఎవరు లేదు మూసుకొని ఉండు పిచ్చోడిలా ప్రవర్తించోద్దు” …. మూడో సారి వర్ష కనిపించింది అని చెప్పాను “రేయ్ వీడికి హ్యలుసినేషన్ ఉన్నట్టు ఉంది డాక్టర్ దగ్గరికి తీసుకెల్లండి అన్నాడు ఎవడో ”… తరువాత మరో నాలుగు సార్లు కనిపించిన ఎక్కడ పిచ్చి ఆసుపత్రిలో చేరిపిస్తారో అని భయంతో ఉరికే ఉన్న ఏంటో పిచ్చి పడుతోంది … రాత్రి ఏడు అయింది కేబిన్ లో కూర్చున్న నాకు ఎదురుగా వర్ష నడుస్తూ వస్తునట్టుగా కనిపిస్తోంది " రేయ్ అనిల్ నువ్వు చెప్పింది కరెక్టే ఎడారి లో ఎండమావులు కనపడి నీళ్ళు ఉన్నాయి అని ఎలా భ్రమ పెడతాయో … అలాగే ప్రతి ఒక లవర్ కి లవ్ ఫెయిల్ అయినప్పుడు ఇదిగో ఇలాగే లవర్ నడిచి వస్తునట్టు , చేయి ఊపుతున్నట్టు, ఫ్లైయింగ్ కిస్ ఇస్తునట్టు నానా భ్రమ పెడతాయి ఏంటో ఈ పాడు లవర్ జీవితం” ఇంతలో వర్ష ఎదురుగా వచ్చి నిలపడినట్టు భ్రమ అందరు బయటకు వెళ్ళిపోయారు … అదేదో సినిమాలో చెప్పినట్టు నాకు హ్యలుసినేషన్ నూరవ స్టేజి కచ్చితంగా అనుకోని పిచ్చి నవ్వు నవ్వాను … “సారీ భరత్ నిన్ను చాల బాధ పెట్టాను నన్ను క్షమించు” అనింది పిచ్చోడిలాగా నవ్వి 101 స్టేజి అన్న … “హే భరత్ ఏమయింది ఎందుకు అలా నవ్వుతున్నావు “ 102…. పట్టుకొని అదిలించింది … అబ్బో ఇది పీక్స్ 500 స్టేజి కి వెళ్లిపోయింది నా పిచ్చి అనుకుంటూ కొద్దిగా వెర్రి నవ్వు నవ్వుతు ఉండగానే చెంపకి హాట హాట్ గా దెబ్బ పడింది అప్పుడు అర్థం అయింది ఎదురుగా ఉండేది వర్షనే అని … “వర్ష మీరు ఏంటి ఇక్కడ అయిన వారం లో పెళ్లి పెట్టుకొని ఇక్కడ ఏంటి ??” కొంచం ఆశ్చర్యం ఆవేశం ఆనందం బాధతో కూడిన గొంతుతో … “నాకు ఏ పెళ్లి ఫిక్స్ కాలేదు” అని తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో జరిగింది అంతా చెప్పింది…. “తను కూడా ఇదే ఆఫీసు వేరే బ్రాంచ్ లో వర్క్ చేసేదని ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకొని ఈరోజే జాయిన్ అయ్యాను అది నాకు టీం లీడ్ గా ….” అంటే పొద్దునుంచి కనపడింది నిజామా అబద్దమా ఇప్పుడు కనిపిస్తూ ఉండేది నిజామా నా భ్రమ ?? ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాకుండా షాక్ తిని అలా నిలిపడిపోయి చూస్తూ ఉన్నా మాట్లాడుతూ ఉంది సారీ చెప్తా ఉంది నాలో ఏమి రియాక్షన్ లేదు… ఇంకో చెంప దెబ్బ పడింది తేరుకొని తల గోక్కుంటూ ఉండగానే నా ఫేవరెట్ చాక్లెట్ మిల్కీ బార్ ఇచ్చి “ఐ లవ్ యు ” అనేసింది … కొంపతీసి కల కాదు కదా ఏంటో ఇది చుట్టూ ఎవరు లేరు తనని దగ్గరికి రమ్మని చేయి ఇమ్మని చెప్పి మెల్లగా గోకాను నిజమే నేను కూడా “ఐ లవ్ యు ” అని నీరసంగా చెప్పాను కోపం తో వెనక్కి తిరిగి వెళ్లిపోతు ఉంటే లహరి అనిల్ అందరు కలిసి కేబిన్ లోకి ఎంటర్ అయి నా నెత్తి మీద ఒకటి పీకాడు ఏంటో ఈరోజు నన్ను తబలా లాగ వాయించేస్తున్నారు .. అనిల్ గాడు నేను వర్ష కోసం తీసుకున్న రింగ్ ఇచ్చాడు తేరుకొని కల నిజం అవుతోంది అన్న ఆనందం ఫుల్ ఫోమ్ కొడుతున్నారు … వర్ష చేతిని తీసుకొని ఉంగరం తొడిగి ఐ లవ్ యు వర్ష అని అరిచి చెప్పాను .. అందరు చప్పట్లు కొడుతూ మా మీద ఫోమ్ కొడుతూ సెలెబ్రేట్ చేస్తున్నారు …. ఇద్దర్ని వదిలేసి వెళ్ళిపోయారు … బైక్ కీస్ తీసుకొని లాంగ్ డ్రైవ్ ఇష్టం కదా వెళ్దామ … నీకెలా తెలుసు .. బాబు నువ్వు మొదటి రోజే నా ఫీలింగ్స్ అవసరం లేకుండా నీ చరిత్ర నాకు వినిపించావు ….సిగ్గుతో తల దించుకున్న. ఇద్దరం కలిసి బైక్ మీద వెన్నల విహారం చేసి ఇంటికి తీసుకెల్లాను అమ్మ నాన్నకి పరిచయం చేసాను ఆల్రెడీ అనిల్ లహరి వాళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళందరు మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తా అని రూం లోకి వచ్చి సాంగ్ పెట్టి ఫుల్ డాన్సు గెంతులు వేస్తున్న ఆనందంతో … అందరు రూం కి వచ్చారు నా గెంతులు చూస్తున్నారు … వర్ష నవ్వుతు వచ్చి తలకి ఒకటి కొట్టి హాగ్ చేసుకుంది అందరు వెళ్ళిపోయారు మనసార ఇంకోసారి “ఐ లవ్ యు వర్ష” అని చెప్పాను ….. “రేయ్ మన పెళ్లి కూడా అభి నందు పెళ్లి కంటే అదిరిపోవాలి ఎం చేస్తావో తెలిదు ” “మా గ్యాంగ్ లో నా లాగ అల్లరి చేసేవాళ్ళు ఎవరు లేరే ఎలా “ ఇంతలో గ్యాంగ్ మొత్తం నువ్వు నేర్పించావు గా నీ లాగే అల్లరి చేస్తూ మేము మా లైఫ్ పార్టనర్ ని నీ పెళ్ళిలో వెతుక్కుంటాం అని రూం లోకి వచ్చి ఇద్దర్ని ఎత్తుకున్నారు ….

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com