అండర్ 19 టోర్నమెంటులో భారత జట్టుకు ప్రాతినిధ్యం ..
- January 14, 2016
అంతర్జాతీయ స్థాయిలో అండర్ 19 టోర్నమెంటులో భాగస్వామి కావాలన్నది ప్రతి యువ క్రికెటర్ కల అనడంలో సందేహం లేదు. అయితే 19 ఏళ్ల లోపుగానే ఆ ఆవకాశం రెండో సారి దక్కడం అంటే మాటలు కాదు. అలా అండర్ 19 వరల్డ్ కప్ లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి రెండు సార్లు ఎంపికైన ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 18 మంది ఉంటే వారిలో భారత్ కు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 27 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ కు ఎంపికైన భారత జట్టు సభ్యులలో ముగ్గురు భారత జట్టు తరఫున వరల్డ్ కప్ కు రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారు సర్ఫరాజ్ ఖాన్, రికి భుహి, అవేష్ ఖాన్ లు వీరు ముగ్గరూ కూడా యూఏఈలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.అలాగే ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టులో మెహిది హస్సన్ మీర్జా కూడా రెండో సారి అండర్19 వరల్డ్ కప్ ఆడుతున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







