కిడ్నాప్ యత్నం కేసులో జనవరి 14న తీర్పు
- December 24, 2019
బహ్రెయిన్: 8 ఏళ్ళ బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తి భవితవ్యం జనవరి 14న తేలనుంది. సోషల్ మీడియాలో బాలికపై కిడ్నాప్ యత్నానికి సంబంధించిన వార్తలు రావడం మినహా ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే, బాలిక మాత్రం నిందితుడ్ని గుర్తించిందని ప్రాసిక్యూటర్స్ చెబుతున్నారు. స్కూల్ ముగిసిన సమయంలో తనను కిడ్నాప్ చేసేందుకు నిందితుడు యత్నించినట్లు బాలిక పేర్కొంది. కాగా, నిందితుడు ఈ కిడ్నాప్ యత్నంతో తనకు సంబంధం లేదనీ, తాను బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించలేదని విచారణలో పేర్కొన్నాడు. కాగా, నిందితుడి కుమార్తె కూడా బాధితురాలిగా పేర్కొనబడ్తున్న బాలిక చదువుతున్న స్కూల్‌లోనే విద్యనభ్యసిస్తోందనీ, ఆమెను రిసీవ్ చేసుకునేందుకే అతను స్కూల్‌కి వెళ్ళి వుండొచ్చనీ టీచర్ ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







