హీరో నితిన్ ఇంట పెళ్లిపనులు మొదలయ్యాయి
- February 15, 2020
హీరో నితిన్ త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. శాలిని అనే యువతిని పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో శాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. కాగా శనివారం హైదరాబాద్‌లోని నితిన్ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలొ 'పసుపు కుంకుమ' కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన్ నితిన్ "పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలయ్యింది. మీ ఆశీర్వాదం కావాలి" అని పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'భీష్మ' ఫిబ్రవరి 21న విడుదలవుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!