కరోనా ఎఫెక్ట్‌: ఇంట్లో వుండాలని కోరుతున్న షార్జా పోలీస్‌ పెట్రోల్స్‌

- March 23, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: ఇంట్లో వుండాలని కోరుతున్న షార్జా పోలీస్‌ పెట్రోల్స్‌

షార్జా పోలీస్‌, పెట్రోల్‌ కార్ల ద్వారా ప్రజల్లోకి వెళుతూ, ప్రజలు ఇళ్ళల్లోనే వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ళల్లోంచి బయటకు రావాలని షార్జా పోలీసులు విజఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు షార్జా పోలీసులు సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. మసీదు సమీపంలో నిలిపి వున్న పెట్రోల్‌ వాహనం, ఆ వాహనం నుంచి విన్పిస్తున్న ఆడియో మెసేజ్‌.. ఈ వీడియోలో కన్పిస్తున్నాయి. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ప్రజలు గుమికూడరాదనీ, పబ్లిక్‌ ప్లేసెస్‌లో తిరగరాదనీ పోలీసులు సూచిస్తున్నారు. ‘మీరు ఇంట్లో వుంటేనే అది మీకు ఆరోగ్యకరం..’ అని షార్జా పోలీసులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com