ఫ్రాన్స్‌వో హోలన్‌తో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ లంచ్‌..

- January 24, 2016 , by Maagulf
ఫ్రాన్స్‌వో హోలన్‌తో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ లంచ్‌..

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌తో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ లంచ్‌ చేయనున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా మంగళవారం దిల్లీలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి ఇచ్చే విందు కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానుంది. ఫ్రాన్స్‌ అంబాసిడర్‌ రిచీర్‌ ఐశ్వర్యని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం సరబ్‌జీత్‌ షూటింగ్‌లో ఉన్న ఐశ్వర్య ఈరోజు రాత్రి దిల్లీకి చేరుకోనుంది. దేశంలోని ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నుంచి ఐశ్యర్యకు మాత్రమే ఆహ్వానం అందడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com