పొగమంచు కారణంగా రైళ్లను రద్దు..

- January 26, 2016 , by Maagulf
పొగమంచు కారణంగా  రైళ్లను రద్దు..

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం 45 రైళ్లను రద్దు చేశారు. మరో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు ఉత్తరాది రైల్వే తెలిపింది.ఈ రోజు ఉదయం ఢిల్లీలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఇటీవల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com