'శ్రీమంతుడు' చిత్రం సిల్వర్‌జూబ్లీ సంబరాలు
- January 27, 2016
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'శ్రీమంతుడు' చిత్రం సిల్వర్‌జూబ్లీ సంబరాలు జరుపుకొనుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్ సాధించి మహేశ్‌బాబు చిత్రాల్లో రికార్డు సాధించింది. 15 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారంతో (28 జనవరి)తో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోబోతోంది. ఎమ్మిగనూరు-లక్ష్మణ్ థియేటర్‌లో 175 రోజుల వేడుక జరుగనున్నట్లు చిత్ర బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్(సివిఎం) మాట్లాడుతూ తమ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' 175 రోజులు పూర్తి చేసుకోబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు కొరటాల శివ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని పేర్కొన్నారు. శ్రీమంతుడికి ఐఫా అవార్డుల పంట 'శ్రీమంతుడు' చిత్రానికి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి పురస్కారంతో కలిపి మొత్తం ఆరు ఐఫా అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. ఓ శ్రీమంతుడు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే అంశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేశ్‌బాబు, శ్రుతిహాసన్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







