జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుఫై ఆరోపణ..
- January 27, 2016
మద్యం లేని గ్రామాల్లేవ్.. చంద్రబాబు టెండర్లు వేయిస్తున్నారు: జగన్మోహన్ రెడ్డి మద్యం షాపులు లేని గ్రామాల్లో సైతం వాటిని ఏర్పాటు చేసేందుకు తమ మనుషులతో ఏపీ సీఎం చంద్రబాబు టెండర్లు వేయిస్తున్నారని వైకాపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే మద్యం షాపులనేవి లేకుండా చేస్తామని జగన్ అన్నారు. కాకినాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, యూనివర్శిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయని విషయంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యం లేకుండా చేయాలని ఒక విద్యార్థిని ప్రశ్నించగా.. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం షాపులు లేకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. 'ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలను చొక్కా పట్టుకుని నిలదీయండని జగన్ పిలుపునిచ్చారు. విద్యార్థులతో ఇంటరాక్షన్‌కు ముందు జగన్ ప్రసంగించారు. ఉద్యోగాలు ఎలా కత్తిరించాలా? అని ఏపీ సర్కార్ దిక్కుమాలిన ఆలోచన చేస్తోందని, ఆరోగ్య మిత్ర ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు.ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటినా నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. పీహెచ్‌డీలు చేసిన వారు కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







