సౌదీ అరేబియా లో కొరడా దెబ్బల శిక్ష రద్దు
- April 25, 2020
రియాద్:సౌదీ అరేబియా లో నేరాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించే ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లఘించే వారికి విధించే కొరడా దెబ్బలు కొట్టే శిక్షను సౌదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే గతంలో ఏయే నేరాలకు కొరడా దెబ్బలు కొట్టేవారో వాటికి జైలు శిక్ష కానీ జరిమానా కానీ లేదా రెండూ అమలు చేయనుంది. కాగా.. సుప్రీం కోర్టు జనరల్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల ప్రకారం కొరడా శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. కొరడా దెబ్బల శిక్ష ను రద్దు చేయడం మంచి నిర్ణయమని, కానీ ఇది ఏడాది క్రితమే తీసుకుని ఉంటే బాగుండేదని హ్యూమన్ రైట్స్ వాచ్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







