దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

- May 04, 2020 , by Maagulf
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

మనామా:23,000 బహ్రెయినీ దినార్స్ విలువైన నగదు అలాగే విలువైన వస్తువులు గల ‘సేఫ్’ దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. నిందితుల వయసు ఒకరిది 26 కాగా, మరొకరిది 23. కార్ వర్క్ షాప్ నుంచి నిందితులు ఈ దొంగతనం చేసినట్లు అధికారులు తెలిపారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్్సతో కలిసి సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ ద్వారా కేవలం 24 గంటల్లోనే ఈ కేసుని ఛేదించారు. విచారణలో నిందితుల ఆచూకీ తెలిసిందని డైరెక్టర్ జనరల్ చెప్పారు. దొంగతనానికి గురైనవాటిల్లో వాచీలు, పెన్నులు, కెమెరాలు మరియు ల్యాప్ టాప్ వున్నాయి. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com