యూ ట్యూబ్ వీడియో: అబుధాబి రెసిడెంట్ పై విచారణ
- May 04, 2020
అబుధాబి రెసిడెంట్, రేసిస్ట్ అలాగే హేట్ కామెంట్స్ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియో ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేయడం జరిగింది. తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా నిందితుడు విద్వేషానికి, జాత్యహంకారానికి పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యూఏఈలో నివసిస్తున్న వివిధ వర్గాల్ని కించపర్చేలా ఈ వీడియో రూపొందిందని వారు చెప్పారు. క్రమంగా ఈ వీడియో చాలా సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ అవుతోందని వివరించారు అధికారులు. జాతి ఐక్యతను దెబ్బతీసేలా, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని అథారిటీస్ పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ, ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 500,000 నుంచి 1 మిలియన్ దిర్హామ్ ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







