కరోనా వైరస్‌ రూల్స్‌ని అతిక్రమించిన 84 షాప్‌లు

- May 05, 2020 , by Maagulf
కరోనా వైరస్‌ రూల్స్‌ని అతిక్రమించిన 84 షాప్‌లు

దుబాయ్‌ ఎకానమీ, మరో రెండు షాపుల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 81 ఔట్‌లెట్స్‌కి ఉల్లంఘనల నేపథ్యంలో వార్నింగ్‌ జారీ చేయడం జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిబంధనలు పాటించాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినా, కొన్ని షాపులు ఇప్పటికీ నిబంధనలకు లోబడి పనిచేయడంలేదు. ఓ టైలర్‌ షాప్‌లో వినియోగదారులు సోషల్‌ డిస్టెన్సింగ్‌ని పాటించడంలేదంటూ అందుకు తగ్గ ఓ వీడియోను డిఇడి సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. కాగా, ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, ప్రతి షాప్‌ నిబంధనల్ని పాటించాల్సిందేననీ, వినియోగదారులు కూడా బాధ్యతగా మెలగాలని అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్‌19 ప్రికాషనరీ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘనలపై వినియోగదారులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. 6000545555 నెంబర్‌లో ఫిర్యాదులు చేయడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com