'కళావతి' సినిమా రివ్యూ
- January 29, 20162014లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన చంద్రకళ (అరణ్మనై) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మరో హార్రర్ కామెడీ చిత్రం అరణ్మనై 2. ఈ చిత్రాన్ని 'కళావతి' పేరుతో తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ గా పేరున్న హార్రర్ కామెడీ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా సిద్దార్థ్, త్రిష లాంటి స్టార్ లు కూడా యాడ్ అవ్వడం సినిమా మీద అంచనాలను పెంచేసింది. మరి 'చంద్రకళ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కళావతి' తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు భయపెట్టింది..?కథ ఓ జమీందార్ బంగ్లా చుట్టూ తిరుగుతోంది కళావతి కథ. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం అక్కడికి వచ్చే వారిని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం మూలంగానే జమీందార్ కోమాలోకి వెళతాడు. అతని పెద్ద కొడుకుపై కూడా దెయ్యం దాడి చేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల పని పట్టాలనుకుంటాడు జమీందార్ చిన్న కొడుకు (సిద్దార్థ్), అందుకు అతనికి కాబోయే భార్య (త్రిష) సాయం చేస్తుంది. ఈ పోరాటంలో బంగ్లాలో ఉన్న దెయ్యం చనిపోయిన తన చెల్లెలు కళ(హాన్సిక) అని తెలుసుకుంటాడు సిద్దార్థ్. అసలు కళ దెయ్యంగా ఎలా మారింది..? చివరకు సిద్దార్థ్ కళకు ఎలా విముక్తి కలిగించాడు అన్నదే మిగతా కథ.నటీనటులు తొలిసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బీచ్ సాంగ్ తో కమర్షియల్ కంటెంట్ ను యాడ్ చేసింది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.సాంకేతిక నిపుణులు చంద్రకళ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుందర్.సి మరోసారి అదే ఫామ్ చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం విజయం సాధించటంతో తన మీద ఏర్పడ్డ అంచనాలను అందుకునే స్థాయి సినిమాను తెరకెక్కించటంలో విజయం సాధించాడు. హిప్ హాప్ తమీజా సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.ప్లస్ పాయింట్స్ సిద్దార్థ్, హన్సిక స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫిమైనస్ పాయింట్స్ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ హర్రర్ కామెడీ జానర్ఓవరాల్ గా కళావతి, సౌత్ సిల్వర్ స్క్రీన్ పై హర్రర్ కామెడీలకు తిరుగులేదని ప్రూవ్ చేసిన సక్సెస్ ఫుల్ సినిమా
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు