ఈ రోజు ఆరు చిత్రాలు విడుదల
- January 28, 2016
సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'డిక్టేటర్'లో బాలకృష్ణ తన యాక్షన్‌తో అదరగొడితే, 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో నాగార్జున అందరినీ ఆకట్టుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా నవ్వులు పంచగా, నాన్నకు ప్రేమతో చిత్రం తండ్రితో మనకున్న బంధాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ చిత్రాల తరువాత శుక్రవారం(జనవరి 29) నాడు ప్రేక్షకులను వూరిస్తూ వారికి వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు సిద్ధమాయ్యయి. 'లచ్చిందేవికి ఓ లెక్కుంది', 'కళావతి', 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు', 'నేను రౌడీనే' చిత్రాలు విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదేవిధంగా సన్నీలియోని నటించిన 'మస్తీజాదే', మాధవన్ నటించిన 'సాలా ఖదూస్' చిత్రాలు సైతం శుక్రవారం నాడే విడుదలయ్యాయి. లచ్చిందేవి లెక్క తెలుస్తుంది 'అందాల రాక్షసి' జంట లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర నటించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. జగదీశ్ తలసిల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇటీవల ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఇది ఒక కొత్త రకమైన కథతో రూపొందించిన చిత్రం. కథలో లచ్చిందేవి ఎవరు? ఆమె లెక్కేంటి? అనే అంశాలు ఆసక్తికరంగా సాగుతాయని పేర్కొన్నారు. మరి లచ్చిందేవి లెక్కేంటో! సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 'కళావతి' భయపెడుతుందా! యువ, నువ్వొస్తానంటే... నేనొద్దంటానా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన జంట సిద్ధార్థ్, త్రిష. వీరిద్దరూ దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ 'కళావతి' చిత్రంలో జంటగా నటించారు. వీరితోపాటు హన్సిక, కొవై సరళ, పూనమ్ బజ్వా, మనోబాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుందర్. సి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జివ్వాజి రామాంజనేయులు సమర్పిస్తున్నారు. 2014లో విడుదలైన చంద్రకళ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అరణ్మణై-2 అనే టైటిల్‌తో ఈ చిత్రం తమిళంలో తెరకెక్కింది. ఇది ఒక హర్రర్ కామెడీ చిత్రం. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' కుమారి 21 ఎఫ్ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్న నటుడు రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. అర్తన కథానాయకి. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. శైలేంద్ర నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. నేను రౌడీనే నయనతారా, విజయ్ సేతుపతి జంటగా నటించిన చిత్రం 'నేను రౌడీనే'. కల్పనా చిత్ర బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. మస్తీజాదే ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోని కీలక పాత్రలో నటించిన చిత్రం 'మస్తీజాదే'. మిలప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజీవ్ సింగ్ పాల్, అజయ్ రాయ్‌లు నిర్మించారు. తుషార్ కపూర్, వీర్‌దాస్, సురేష్ మేనన్, షార్ రంధ్వాలు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సాలా ఖదూస్ మాధవన్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'సాలా ఖదూస్'. సుధా కొంగర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ హిరణి, మాధవన్‌లు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







