వేరే దేశాన్ని అవమానించినందున కేసులో

- January 29, 2016 , by Maagulf
వేరే దేశాన్ని అవమానించినందున కేసులో

సైడర్‌ క్రైమ్‌ డైరెక్టరేట్‌ సోషల్‌ మీడియా ద్వారా ఓ వ్యక్తి వేరే దేశాన్ని అవమానించినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై నేరారోపణకు సంబంధించిన ఆధారాల సేకరణ పూర్తయ్యింది. జనవరి 31న 9వ లా క్రిమినల్‌ కోర్ట్‌లో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడి, ర్యాలీలు, ఆందోళనలకు కారణమయ్యాడని, ఇది బహ్రెయిన్‌ చట్టాలు నిబంధనలను అతిక్రమించడమేనని వాదనలు వినిపించాయి. మొబైల్‌ ఫోన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోబడిన ఆధారాలు, ఇతర మరికొన్ని ఆధారాలను సేకరించి, దోషిగా అతన్ని నిర్ధారించేందుకు చర్యలు తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com