'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమా రివ్యూ
- January 29, 2016
వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్న కుర్ర హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' నేడు విడుదలైంది. టైటిల్ ఓల్డ్ గా ఉన్నా.... ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ లాంటి వరుస హిట్లు కొట్టిన హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఉంటూ వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాపులో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.కథ విషయానికొస్తే...రామచంద్రాపురంలో హ్యాపీగా, అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు శ్రీరామ్(రాజ్ తరుణ్). అతనికి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం తన చిన్ననాటి నుండి తాను ఇష్టపడిన సీత(ఆర్తన)ను పెళ్లాడటం.ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించినా విఫలం అవుతాడు. హీరోది ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేని రేంజి...హీరోయిన్ డాక్టర్ చదువు. సీతును ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నించే క్రమంలో ఓ కరెక్ట్ టైమ్ చూసుకుని తన ప్రేమ విషయం సీతకి తెలియజేస్తాడు రాము. అయితే సీత తన ప్రేమను వెంటనే రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన సీత తండ్రి(రాజారవీంద్ర) ఆమె వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ తో చేయాలని డిసైడ్ చేస్తాడు. మరి రాము సీతను ఎలా దక్కించుకున్నాడు? అనేది తర్వాతి కథ.పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే... రాజ్ తరుణ్ తనదైన నటనతో పాత్రలో ఇమిడి పోయాడు. సీత పాత్రలో ఆర్తన మెప్పించింది. ఆమెకు ఇది మొదటి సినిమా అయినా పెర్ఫార్మెన్స్ పరంగా, అందం పరంగా ఆకట్టుకుంది. శకలక శంకర్ కామెడీ బావుంది. రాజా రవింద్ర, సురేఖ, ఆదర్ష్ మధునందన్, విజయ్, జోగినాయుడు, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి మిగతా నటినటులు వారి వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.టెక్నికల్ గా హైలెట్ఈ సినిమా బాగా హైలెట్ అయిన టెక్నికల్ అంశాల్లో సినిమాటోగ్రఫీ, సంగీతం. విశ్వ సినిమాటోగ్రఫీ బావుంది. పల్లెటూరి అందాలను సినిమాలో బాగా చూపించాడు. గోపీసుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా సూటయింది. కథకు తగిన విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓక
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







