తెలంగాణ లో కొత్తగా 27 కోవిడ్-19 కేసులు
- May 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్-19 కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస శ్రామికులు కోవిడ్-19 వైరస్ బారిన పడినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1661 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 89 మంది వలసజీవులు ఉన్నారని వెల్లడించింది. కోవిడ్ బాధితుల్లో ఇప్పటివరకు 1,013 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 608 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. కోవిడ్-19తో ఇవాళ ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదని హెల్త్‌బులెటిన్‌లో ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







