కరోనా వైరస్‌: ఉల్లంఘనలకు జరీమానా తప్పదు

- May 22, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: ఉల్లంఘనలకు జరీమానా తప్పదు

మస్కట్:కరోనా వైరస్‌ నేపథ్యంలో సుప్రీం కమిటీ నిర్దేశించిన ప్రికాషనరీ మెజర్స్‌ పాటించనివారికి జరీమానాలు తప్పవు. నిబంధనల్ని ఉల్లంఘించేవారికి 1500 ఒమన్‌ రియాల్స్‌ వరకూ జరీమానా పడుతుందని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాజర్‌ బిన్‌ ఖామిస్‌ బిన్‌ అల్‌ సవాయ్‌ మాట్లాడుతూ, పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లోకి ప్రవేశించి ఉల్లంఘనకు పాల్పడుతున్నవారిని గుర్తించి జరీమానాలు విధించే అధికారం పోలీసులకు వుందని చెప్పారు. ఎక్కువమంది గుమికూడితే ఒక్కో వ్యక్తికి 100 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధిస్తారు. ఫేస్‌ మాస్క్‌ ధరించకపోతే 20 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా తప్పదు. ఇన్‌స్టిట్యూషనల్‌ మరియు డొమెస్టిక్‌ క్వారంటైన్‌ని ఉల్లంఘిస్తే 1500 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎక్కువమంది గుమికూడే కార్యక్రమాల్ని నిర్వహించేవారికి 1500 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com