జమాల్‌ ఖషోగి హంతకులకు క్షమాభిక్ష

జమాల్‌ ఖషోగి హంతకులకు క్షమాభిక్ష

రియాద్‌: దారుణ హత్యకు గురైన  జమాల్‌ ఖషోగి ఉదంతంలో దోషులకు క్షమాభిక్ష లభించింది. తన తండ్రిని చంపిన కిరాతకుల్ని క్షమించేస్తున్నట్లు జమాల్‌ ఖషోగి కుమారుడు సలాహ్‌ ఖషోగి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించారు సలాహ్‌. తన కుటుంబం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనీ, పవిత్ర రమదాన్‌ మాసం నేపథ్యంలో అల్లా నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సలాహ్‌. 2018 అక్టోబర్‌ 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లోగల సౌదీ కాన్సులేట్‌ వద్ద ఖష్తోగీని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

 

Back to Top